టాక్..మహేష్ ఊహించని ప్లానింగ్ లో ఉన్నారా.?

Published on Apr 18, 2021 8:40 am IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే సాలిడ్ మాస్ ఫ్లిక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే దీనిపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో కూడా అందరికీ తెలుసు. అయితే ఈ చిత్రం అనంతరం దర్శక ధీరుడు రాజమౌళితో చెయ్యబోయే భారీ పాన్ ఇండియన్ సినిమా టేకప్ చెయ్యడానికి ముందు ఖచ్చితంగా ఓ సినిమా కంప్లీట్ చేసే యోచనలో ఉన్నారని తెలిసింది.

కానీ ఇప్పుడు లేటెస్ట్ టాక్ ఏమిటంటే మహేష్ రాజమౌళితో సినిమా కంటే ముందు ఒకటి కాదు రెండు సినిమాలు ప్లాన్ చెయ్యాలని అనుకుంటున్నట్టుగా నయా రూమర్. వారిలో ఇప్పటికే త్రివిక్రమ్ పేరు కన్ఫర్మ్ కాబట్టి ఆ రెండో ప్రాజెక్ట్ ఎవరు చేస్తారో అన్నది ఆసక్తిగా మారింది. సో మహేష్ నుంచి ఎలా లేదన్నా పరిస్థితులు బాగుంటే వచ్చే ఏడాదిలోనే డబుల్ ఫీస్ట్ పక్కా అని చెప్పొచ్చు. మరి ఏం జరగనుందో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :