నైజాం కింగ్ మహేష్ అనడానికి..ఇదే నిదర్శనం.

Published on Jan 16, 2020 4:39 pm IST

సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు మూవీ వసూళ్ల పరంపర కొనసాగుతుంది. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో 68.22 కోట్ల షేర్ వసూలు చేసి ఔరా అనిపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. కాగా సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మహేష్ నైజాంలో ఓ అరుదైన రికార్డు నమోదు చేశారు. నాలుగు సార్లు 20కోట్లకు పైగా షేర్ సాధించిన హీరోగా తన పేరు నమోదు చేస్తుకున్నారు. గతంలో మహేష్ నటించిన శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి 20కోట్లకు పైగా షేర్ సాధించాయి. ఇక తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు ఐదు రోజులకు నైజాంలో 22.5 కోట్ల షేర్ రాబట్టింది.

దీనితో నాలుగు సార్లు నైజాంలో 20కోట్లకు పైగా షేర్ వసూలు చేసి నైజాం కింగ్ అనిపించుకున్నారు. టాలీవుడ్ నుండి ఏ ఇతర హీరో నాలుగుసార్లు ఈ ఫీట్ చేరుకోలేదు. మహేష్ చిత్రాలలో మహర్షి 30కోట్లకు పైగా షేర్ తో కెరీర్ హైయెస్ట్ గా ఉంది. దర్శకుడు అనిల్ రావిపూడి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కించారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటించగా దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర నిర్మించారు. దేవిశ్రీ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

X
More