ఓవర్సీస్‌లో మహేష్ ‘ఖలేజా’ మేనియా షురూ!

khelaje

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ-రిలీజ్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలు హిట్ చిత్రాలు రీ-రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర అభిమానులను అలరించాయి. ఇక ఇప్పుడు ఈ కోవలోనే మరో రెండు ఇంట్రెస్టింగ్ చిత్రాలు కూడా రీ-రిలీజ్‌కు రెడీ అయ్యాయి. ఇందులో క్లాసిక్ కల్ట్ చిత్రంగా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహేష్ బాబు ఖలేజా చిత్రం కూడా ఒకటి.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సోషియో డ్రామా చిత్రం 2010లో రిలీజ్ కాగా.. అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర ఫ్లా్ప్‌గా నిలిచింది. కానీ, ఆ తర్వాత ఈ సినిమాకు కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇన్నేళ్లు గడిచినా కూడా ఈ సినిమాపై ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ సినిమాను మే 30న రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

అయితే, మహేష్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి 50 సెకన్ల ఓ మాషప్ వీడియోను మరో హీరో జూ.ఎన్టీఆర్ నటించిన ‘యమదొంగ’ రీ-రిలీజ్‌కు అటాచ్ చేసి ప్రదర్శిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఓవర్సీస్‌లోని థియేటర్స్‌లో ఈ మాషప్ ప్రదర్శిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. మరి ఖలేజా చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

Exit mobile version