హరీష్ శంకర్ తో కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్ !

Published on Mar 14, 2019 3:56 am IST

ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మాణంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కే వి గుహన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘118’. మంచి అంచనాల మధ్య ఈ చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ఈ చిత్రం అందించిన విజయానందంతో మహేష్ కోనేరు ఇప్పటికే మరో చిత్రాన్ని కూడా ప్రారంభించారు.

నరేంద్ర అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఈ సినిమా రానుంది. ఈ చిత్రం మార్చి 15 నుంచి షూటింగ్ మొదలవ్వనుంది. అయితే మహేష్ కోనేరు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు హరీష్ శంకర్ తో తమ బ్యానర్ లో ఓ చిత్రాన్ని నిర్మించనున్నానని.. ఆ సినిమా ఈ సంవత్సరం చివరిలో మొదలవుతుందని ఆయన తెలిపారు.

సంబంధిత సమాచారం :