అల్ట్రా మాస్ అండ్ స్టైలిష్ గా సూపర్ స్టార్ మహేష్.!

Published on Apr 18, 2021 4:15 pm IST

మన టాలీవుడ్ లో మాంచి ఆల్ టైం హ్యాండ్సమ్ హీరోల్లో ఎవర్ గ్రీన్ గా సూపర్ స్టార్ మహేష్ పేరు కూడా ఉంటుంది. ముఖ్యంగా ఆ పర్సనాలిటీ మాస్ అండ్ సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ లు పడితే ఆన్ స్క్రీన్ పై ప్రెజెన్స్ మరో లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు దానినే “సర్కారు వారి పాట”లో దర్శకుడు పరశురామ్ పెట్ల అదిరే విధంగా చూపించడం ఖాయం అనేలా అనిపిస్తుంది.

ఇది వరకే ప్రీ లుక్ లో మహేష్ ఎలా ఉంటాడో అన్నది చిన్నగా రివీల్ చేస్తూ వస్తున్నారు. అయితే ఆన్ లొకేషన్ ఫోటోలు మాత్రం ఎప్పటికప్పుడు షూట్ ఉన్నప్పుడల్లా బయటకు వస్తున్నాయి. మరి అలా లేటెస్ట్ గా కూడా కొన్ని బయటకి వచ్చాయి. మరి వీటిని చూస్తే ఓ పక్క చెవికి పోగు మెడలో దండతో మాస్ గా కనిపిస్తూనే మరో పక్క క్లాస్ డ్రెస్సింగ్ తో కూల్ అండ్ అల్ట్రా స్టైలిష్ గా మహేష్ ఇందులో కనిపిస్తున్నారు.

దీనిని బట్టి సర్కారు వారి పాటలో మహేష్ లుక్స్ పరంగా ట్రీట్ కు మాత్రం ఎలాంటి డోకా లేదని చెప్పాలి. ఇప్పుడు ఈ ఫొటోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ చిత్రంతో మొదటిసారిగా మహేష్ తో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వాలారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :