మహేష్ ‘మహర్షి’ లేటెస్ట్ అప్ డేట్స్ !

మహేష్ ‘మహర్షి’ లేటెస్ట్ అప్ డేట్స్ !

Published on Sep 16, 2018 10:23 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25వ చిత్రం ‘మహర్షి’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతుంది. ఇక ఈ షెడ్యూల్ తరువాత తదుపరి షెడ్యూల్ కోసం యూఎస్ వెళ్లనుంది చిత్ర బృందం. అయితే ఈషెడ్యూల్ కోసం మహేష్ తో పాటు తన ఫ్యామిలీ కూడా అమెరికా రానుంది. సుమారు 25రోజులపాటు అక్కడ జరుగనున్న ఈ షెడ్యూల్లో చిత్రానికి కీలకం కానున్న సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. అక్టోబర్ మొదటి వారంలో ఈషెడ్యూల్ ప్రారంభంకానుంది.

ఇక ఈచిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వంశీ పైడిపల్లి ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు, పివిపి , అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు