100 మిలియన్ లాక్ చేసిన మహేష్ మాస్ ఫీస్ట్ సాంగ్!

Published on Apr 24, 2021 1:00 pm IST

చాలా కాలం తర్వాత మళ్ళీ సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి పక్కా మాస్ యాంగిల్ ను చూపించిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది తన లాస్ట్ చిత్రం “సరిలేరు నీకెవ్వరు” అని చెప్పాలి. హిట్ దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్ కు గట్టి ట్రీట్ నే ఇచ్చింది.

ముఖ్యంగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సాంగ్స్ కూడా ఈ సినిమాలో మరో హైలైట్ గా నిలిచాయి. అయితే వాటిలో “మైండ్ బ్లాక్” అనే మాస్ సాంగ్ తో మళ్ళీ వింటేజ్ మహేష్ ను గుర్తు చేసారు. అయితే అప్పుడు ఒక్క ఆడియో పరంగానే కాకుండా వీడియో పరంగా కూడా సాలిడ్ ట్రీట్ ఇచ్చిన ఈ సాంగ్ భారీ రెస్పాన్స్ ను అందుకుంది.

మరి అలా ఇప్పుడు ఈ మాస్ ఫీస్ట్ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ మార్క్ క్రాస్ చేసి మహేష్ కెరీర్ లో మరో 100 మిలియన్ వీడియోగా నిలిచింది. మరి రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ వాలారు నిర్మాణం వహించారు. ప్రస్తుతం మహేష్ మళ్ళీ వింటేజ్ ట్రీట్ ఇచ్చేందుకు మరో మాస్ ఫ్లిక్ “సర్కారు వారి పాట” లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :