మహేష్ సినిమా… హీరో కంటే విలన్‌ కే ఎక్కువ బలం !

Published on Nov 22, 2021 8:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో ఓ సినిమా తెరకెక్కుతుందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్రివిక్రమ్ తన సినిమాల్లో హీరోలను ఎంత తెలివిగలవాడిగా చూపిస్తాడో విలన్లను కూడా అంతే తెలివిగలవాడిగా చూపిస్తాడు. ఇంకా క్లుప్తంగా చెబితే… హీరో కంటే విలన్‌ కే ఎక్కువ బలం ఉంటుంది.

అందుకే త్రివిక్రమ్ మహేష్‌ బాబుతో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం బలమైన విలన్‌ పాత్రను రాసినట్టు తెలుస్తోంది. ఆ పాత్రలో తమిళ హీరో ఆర్య కనిపించబోతున్నాడట. ఆర్య కూడా విలన్ గా చేయడానికి సుముఖత వ్యక్తం చేశాడట. ఎలాగూ స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్ పూర్తి అయింది కాబట్టి.. త్వరలోనే బడ్జెట్ పై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఇక పదకుండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ‘అరవింద సమేత, ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత త్రివిక్రమ్ చేస్తోన్న సినిమా ఇది. అందుకే ఈ సినిమాకి రెట్టింపు ఎక్స్ పెటేషన్స్ ఉన్నాయి. హారిక హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుంది.

సంబంధిత సమాచారం :

More