మహేష్ కొత్త వీడియో సరికొత్తగా ఉందే

మహేష్ కొత్త వీడియో సరికొత్తగా ఉందే

Published on Oct 7, 2019 12:02 AM IST

Mahesh Babu

అనేక స్థానిక, జాతీయ సంస్థలకు మహేష్ మోస్ట్ వాంటెడ్ బ్రాండ్ అంబాసిడర్. ఇప్పటికే మహేష్ అనేక సంస్థలకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నాడు. ఐతే సొంతగా మహేష్ కొన్ని నెలల ముందు ది హంబుల్ కో అనే గార్మెంట్ బ్రాండ్ ని స్థాపించడంతో పాటు, సేల్స్ కూడా మొదలుపెట్టారు. కాగా ఈ సంస్థ ప్రకటన కోసం మహేష్ ఒక యాడ్ లో నటించారు.

హీరో అవ్వాలంటే నటుడే కావాల్సిన అవసరం లేదంటూ సాగిన ఆయన ఫిలాసఫీ నచ్చినది చేస్తూ హ్యాపీగా జీవించటమే అసలైన గుర్తింపు, విజయం అన్న రేంజ్ లో ఆయన వీడియో సాగింది. బ్యాక్ గ్రౌండ్ లో వివిధ పనులు చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న వారిని చూపిస్తూ మహేష్ చెప్పిన విధానం బాగుంది. తన బట్టల సంస్థ ది హంబుల్ కో అమ్మకాలు పెరగడానికి, వ్యాపారం అభివృద్ధి కావడానికి మహేష్ స్వయంగా రంగంలోకి దిగినట్టున్నారు.

ఇక సరిలేరు నీకెవ్వరూ మూవీకి కొంచెం గ్యాప్ ఇచ్చి కుటుంబంతో కలిసి విదేశీయానానికి మహేష్ వెళ్లడం జరిగింది. ఆయన తిరిగి వచ్చిన వెంటనే తదుపరి షెడ్యూల్ మొదలు కానుంది. దాదాపు 75శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలతో పాటు, పాటలు చిత్రీకరించాల్సివుంది.

https://www.instagram.com/p/B3RgGcunpR3/

తాజా వార్తలు