మహేష్ ఖాతాలో మరో బ్రాండ్ !

మహేష్ ఖాతాలో మరో బ్రాండ్ !

Published on Jul 18, 2018 6:43 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పటినుండో ప్రచారకర్తగా మారి ప్రముఖ బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తున్నాడని తెలిసిందే. దాంట్లో భాగంగా ‘థమ్స్ అప్ , మహీంద్రా , టాటా స్కై, ఐడియా సెల్యూలర్, చెన్నై సిల్క్స్ ‘మొదలైన వాటికీ ప్రచారక్తగా నియమించబడ్డాడు.

ఇప్పుడు తాజాగా ఆయన ఖాతాలోకి మరొక ప్రముఖ బ్రాండ్ చేరింది. ప్రముఖ టూత్ పేస్ట్ ‘క్లోసప్’ ఆయనను ప్రచారకర్తగా నియమించుకుంది. ఈ యాడ్ కు సంభందించిన షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు త్వరలోనే ఈ యాడ్ టీవీలో రానుంది. ఇక మహెష్ బాబుకు ఇప్పటివరకు 29వ బ్రాండ్లకు ప్రచారకర్త గా నియమించబడ్డారు.

ఇక మహేష్ నటిస్తున్న 25 వ చిత్రం యొక్క సెకండ్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు