టాక్..”సర్కారు వారి పాట”లో నెవర్ బిఫోర్ మహేష్ ని చూస్తామా?

Published on Mar 13, 2022 6:55 pm IST


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆల్ మోస్ట్ షూటింగ్ ముగింపు దశలో ఉంది. అయితే ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా మహేష్ నుంచి వరుస బ్లాక్ బస్టర్ లు మూడు కొట్టాక వస్తున్న సినిమా ఇది కావడంతో మహేష్ ఫ్యాన్స్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తీసుకున్నారు.

అయితే ఈ చిత్రంకి గాను ముఖ్యంగా ఫ్యాన్స్ కి కావాల్సిన సాలిడ్ ఎలిమెంట్స్ అన్నీ పరశురామ్ ప్లాన్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ముఖ్యంగా మహేష్ చేసే రోల్ అభిమానులకి ఫీస్ట్ ఇచ్చే విధంగా ఉంటుందట. ఆల్రెడీ ఇది తన లుక్స్ మరియు డ్రెస్సింగ్ తో కన్ఫర్మ్ అయ్యింది కానీ సినిమాలో మాత్రం మహేష్ ని నెవర్ బిఫోర్ గా చూస్తామాట.

తన రోల్ మాంచి డాషింగ్ అండ్ డైనమిక్ గా కనిపిస్తుందట. అంతేకాకుండా తన యాటిట్యూడ్ కూడా మంచి పవర్ ఫుల్ గా కనిపించి మహేష్ ఫ్యాన్స్ పాత రోజులు కనిపించేలా చేస్తుందని తెలుస్తుంది. ఇక ఈ యాటిట్యూడ్ కి తగ్గట్టు తన లుక్స్ తో ఆ విజువల్స్ మరింత సాలిడ్ గా ఉంటాయట. మరి కంప్లీట్ గా మహేష్ రోల్ ఏ లెవెల్లో ఉంటుందో తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :