బజ్..మహేష్ రెండో డైరెక్టర్ దొరికేసారా.?

Published on Apr 21, 2021 10:00 am IST

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు పరశురామ్ పెట్ల తో “సర్కారు వారి పాట” అనే భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం అనంతరం దర్శక ధీరుడు రాజమౌళితో ఓ భారీ పాన్ ఇండియన్ సినిమా కూడా ఉంది. అయితే దీనికి ముందు ఖచ్చితంగా ఒక సినిమా చేసే ప్లాన్ లో ఉన్నారని ఆ మధ్య తెలిసింది.

కానీ ఒకటి కాదు రెండు సినిమాలు మహేష్ కంప్లీట్ చేస్తారని మళ్ళీ టాక్ వచ్చింది. మరి వీరిలో ఆల్రెడీ త్రివిక్రమ్ పేరు కన్ఫర్మ్ కాగా ఇప్పుడు ఆ రెండో దర్శకుని పేరు కూడా ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది. ఈసారి మళ్ళీ ఓ తమిళ్ దర్శకునికి మహేష్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.

అది కూడా టాలెంటెడ్ మహిళా దర్శకురాలు సుధా కొంగర పేరు అని టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజముందో కానీ ఇది వరకు కూడా ఈ కాంబోలో సినిమా ఉంటుంది అని టాక్ వచ్చింది. మరి ఈ ఇంట్రెస్టింగ్ కాంబో ఎంత వరకు ఉందో చూడాలి.

సంబంధిత సమాచారం :