“సర్కారు వారి పాట” రికార్డ్ లెవెల్ బిజినెస్ ఆల్రెడీ స్టార్ట్.?

Published on Apr 9, 2021 7:05 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై నెవర్ బిఫోర్ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ చేసిన గత మూడు చిత్రాలు ఒకదాన్ని మించి ఒకటి భారీ హిట్ కావడంతో ఇక నెక్స్ట్ హ్యాట్రిక్ దీనితోనే మొదలవ్వాలని సాలిడ్ గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. మరి అందుకు తగ్గట్టుగానే ఆల్రెడీ ఈ సినిమా బిజినెస్ లెక్కలు స్టార్ట్ అయ్యాయని టాక్ వినిపిస్తుంది.

తాజాగా ఈ చిత్రం ఉత్తరాంధ్ర బిజినెస్ ను కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది. అది కూడా రికార్డు లెవెల్ ఫిగర్ కే ఈ చిత్రం తాలూకా థియేట్రికల్ హక్కులు అమ్ముడు పోయినట్టుగా తెలుస్తుంది. మరి టాక్ ప్రకారం ఈ చిత్రం హక్కులు 15 కోట్లకు అమ్ముడు పోయాయని వినికిడి. మొత్తానికి మాత్రం మహేష్ సినిమా అప్పుడే సాలిడ్ బిజినెస్ షురూ చేసింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :