మే 31న మహేష్ ‘సర్కారు’ టీజర్ !

Published on May 17, 2021 8:02 am IST

‘సూపర్ స్టార్ కృష్ణ’ పుట్టిన రోజు ఈ నెల 31వ తేదీ. ఆ రోజు ఫ్యాన్స్ కి మహేష్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కృష్ణ ప్రతి పుట్టిన రోజుకూ మహేష్ తన సినిమాకి సంబంధించి ఏదొక అప్ డేట్ ను తమ అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. అలాగే ఈ సారి కూడా తన కొత్త సినిమా టీజర్ రూపంలోనో, లేదా కనీసం తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ తోనే, మహేష్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తాడని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరి మహేష్, తన తండ్రి కృష్ణ పుట్టిన రోజున నాడు ఏ గిప్ట్ ఇస్తాడో చూడాలి. ఇప్పటికే త్రివిక్రమ్ – మహేష్ బాబు సినిమా ప్రకటన కూడా మేడే నాడే స్పెషల్ గా ఎనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి కొత్తగా ప్రకటించడానికి కూడా ఏమి లేదు. ఇక గత ఏడాది పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా టైటిల్ ని ప్రకటించి, కృష్ణగారికి మంచి గిప్ట్ ఇచ్చారు. ఈ పుట్టినరోజుకి కూడా ఆ సినిమాకు సంబంధించే ఏదోకటి రిలీజ్ చేస్తారు. అయితే సర్కారు టీజర్ ను రిలీజ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది.

సంబంధిత సమాచారం :