మహేష్ 25వ సినిమా రైతుల గురించేనా ?
Published on Jun 28, 2018 8:28 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు సామాజిక పరమైన అంశాలను కలిగిన సినిమాల్ని చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. చివరి చిత్రం ‘భరత్ అనే నేను’లో ముఖ్యమంత్రిగా కనబడి పలు సామాజిక సమస్యల్ని ప్రస్తావించిన ఆయన ఇప్పుడు చేస్తున్న 25వ చిత్రంలో పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లోని రైతుల సమస్యలను, కష్టాలను గురించి మాట్లాడతారట.

ఫిల్మ్ నగర్ వార్తల మేరకు సినిమాలో రైతుల రుణాలు, వాళ్ళ బీద పరిస్థితులను ప్రధానంగా సినిమాలో ప్రస్తావించడం జరుగుతుందని, అలాగే సినిమా రైతుల్లో కొత్త ఉత్తేజం నింపే తరహాలో ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం డెహ్రాడూన్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి విడుదలయ్యే అవకాశాలున్నాయి. పూజా హెగ్డే కకథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీ దత్ కలిసి నిర్మిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook