సూపర్ హిట్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న మహేష్ ?

Published on Jul 2, 2018 8:31 am IST

వచ్చే ఏడాది విడుదలకానున్న భారీ చిత్రాల్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం కూడ ఒకటి. ఇది మహేష్ యొక్క సిల్వర్ జూబ్లీ చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా వేసవికి విడుదలకానుందని గతంలోనే తెలియగా ఇప్పుడు ఏప్రిల్ 5వ చిత్రం తేదీన విడుదలయ్యే అవకాశాలున్నట్టు సమాచారం.

ఇలా ఏప్రిల్ నెలలోనే సినిమాను విడుదలచేయాలనుకోవడానికి ఒక బలమైన కారణమే ఉందట. మహేష్ బాబుని స్టార్ హీరోగా నిలబెట్టిన ‘పోకిరి’, ఇటీవల ఆయన సాధించిన సూపర్ హిట్ ‘భరత్ అనే నేను’ రెండూ ఏప్రిల్ నెలలోనే విడులయ్యాయి. అందుకే ఆ నెలలోనే విడుదల చేస్తే బాగుంటుందని మహేష్, దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అయితే ఈ వార్తపై ఇంకా అధికారిక కన్ఫర్మేషన్ అందాల్సి ఉంది. దిల్ రాజు, అశ్విన్ దత్ లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :