‘భరత్ అనే నేను’ వేడుకకు అతిథులుగా రామ్ చరణ్, ఎన్టీఆర్ !


సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రం యొక్క ఆడియో వేడుక ఏప్రిల్ 7వ తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న సంగతి తెలిసిందే. భారీ స్థాయిలో జరగనున్న ఈ వేడుకకు వేల సంఖ్యలో అభిమానులు హాజరుకానున్నారు. సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, తారక్ లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలనే యోచనలో ఉన్నారట మహేష్.

అయితే ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి నిజంగానే మహేష్ వారిద్దరినీ వేడుకకు ఆహ్వానిస్తారో లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా కొరటాల శివ దర్శకత్వం వహించారు.