కళ్యాణ్ రామ్ సినిమా బాగుందంటూ మహేశ్ బాబు.. !

Published on Mar 7, 2019 10:54 pm IST

కే వి గుహన్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ‘118’ చిత్రం మంచి అంచనాల మధ్య విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో థియేటర్లలో ఈ చిత్రం మొదటి రోజు నుండి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకెళ్తూ ఉంది. అయితే ఈ సినిమా సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులను కూడా ఆకట్టుకుంటుంది.

కాగా తాజాగా ఈ సినిమా పై స్పందిస్తూ సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్ చేస్తూ.. “నాకు 118 చిత్రం థ్రిల్లింగ్ గా అనిపించింది. గుహన్ గారి సినిమాటోగ్రఫీ, అలాగే దర్శకత్వం చాలా బాగున్నాయి. ఈ సినిమాకి సంబంధించి మొత్తం చిత్రబృందానికి నా అభినందనలు” అని ట్వీట్ చేశారు. మహేష్ బాబు ట్వీట్ తో సినిమా చూడని మహేశ్ అభిమానులు ఖచ్చితంగా సినిమా చూస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత సమాచారం :