కాళేశ్వరం పై మహేష్ స్పందన అద్భుతం.

Published on Jun 22, 2019 8:15 am IST

దశాబ్దాల తెలంగాణా ప్రజల కలను సాకారం చేస్తూ ,హైదరాబాద్ ప్రజల దాహర్తి తీర్చేందుకు,రైతుల పొలాలు సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ప్రారంభించారు. ఈ మహోన్నత ఘట్టానికి ఆంధ్ర ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి,తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అతిధులుగా హాజరై ప్రారంభించారు. . ఇంతటి మహోజ్వల ఘట్టానికి స్పూర్తి ప్రదాత అయిన, అపర భగీరధుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.

తాజాగా ఈ విషయంపై సూపర్ స్టార్ మహేష్ స్పందిస్తూ “‘ విప్లవాత్మక అద్భుతం.. తెలంగాణ ప్రజలు గర్వంగా భావించే కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు, కేటీఆర్ కు శుభాకాంక్షలు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించిన ఇంజనీర్లకు హ్యాట్సాఫ్” అంటూ ట్విట్టర్ వేదికగాప్రశంసలు కురిపించారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతమంటూ నాగార్జున, రవితేజ వంటి స్టార్ హీరోలు కూడా తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More