గల్లా జయదేవ్‌ను పరామర్షించిన మహేష్

mahesh-family

ప్రముఖ వ్యాపారవేత్త, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ గత కొద్దిరోజుల క్రితం బైక్ యాక్సిడెంట్‌కు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక గల్లా జయదేవ్‌కు బావమరిది అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు, భార్య నమ్రతతో కలిసి జయదేవ్ ఇంట్లో నిన్న ఆయన్ను కలిశారు. ‘శ్రీమంతుడు’ విజయం తర్వాత కొన్నాళ్ళపాటు థాయ్‌లాండ్‌లో వెకేషన్‌కు వెళ్ళిన ఈమధ్యే తిరిగివచ్చారు. తిరిగివచ్చాక మహేష్ జయదేవ్‌ను కలిసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

ఇక ఇదే విషయమై గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. “ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్నా. మెల్లిగా నడవగలుగుతున్నా” అంటూ మహేష్, నమ్రతలతో దిగిన ఓ ఫోటోను తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో సూపర్ స్టార్ మహేష్, నమ్రత, గల్లా జయదేవ్ కుటుంబ సభ్యులను చూడొచ్చు.

Exit mobile version