కాస్త ముందే షురూ చేయనున్న మహేష్.?

Published on Jul 4, 2021 6:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రాన్ని దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం రెండో షెడ్యూల్ కూడా సిద్ధం అయ్యిపోయింది. అయితే ఈ షెడ్యూల్ వచ్చే జూలై 15 నుంచి స్టార్ట్ కానుంది అని తెలిసిందే..

కానీ లేటెస్ట్ టాక్ ప్రకారం మహేష్ ఇంకాస్త ముందు గానే షూట్ షురూ చేసేయనున్నట్టు తెలుస్తుంది. ఈ వచ్చే 12వ తారీఖు నుంచి సర్కారు వారి పాట షూట్ మొదలు కానున్నట్టు నయా టాక్. ఈ సినిమా విషయంలో మాత్రం మహేష్ అభిమానులు చాలా కేజ్రీగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సహా 14 రీల్ ఎంటెర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :