అల్లరి హీరోకి మహేష్ బెస్ట్ విశెష్..!

Published on Jun 30, 2020 12:38 pm IST

సూపర్ స్టార్ మహేష్ హీరో అల్లరి నరేష్ కి బర్త్ డే విశెష్ చెప్పారు. అలాగే అల్లరి నరేష్ సుఖ సంతోషాలతో…విజయ పథంలో ముందుకు పోవాలని కాంక్షించారు. గత ఏడాది వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మహర్షి మంచి విజయం సాధించింది. దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ మూవీలో మహేష్ మిత్రుడిగా అల్లరి నరేష్ కీలక రోల్ చేశారు.

కాగా నేడు అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ నాంది టీజర్ విడుదలై విశేష ఆదరణ అందుకుంది. నాంది మూవీలో ఖైదీగా అల్లరి నరేష్ సీరియస్ ఎమోషన్స్ తో కట్టిపడేయడం ఖాయం అనిపిస్తుంది. నాంది మూవీని దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కిస్తుండగా, సతీష్ వేగేశ్న నిర్మించడం జరిగింది. దీనితో పాటు బంగారు బుల్లోడు అనే మరో చిత్రంలో నరేష్ నటిస్తున్నాడు. దర్శకుడు గిరి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టీజర్ సాయంత్రం విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More