రేపే మహేష్ బాబు ‘ఆగడు’కి ముహూర్తం

Published on Oct 24, 2013 4:56 pm IST

Mahesh_Action

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్న ‘ఆగడు’ సినిమా ముహూర్తం రేపు రామానాయుడు స్టూడియోస్ లో జరగనుంది. 8 గంటల 9 నిమిషాలకు ఈ సినిమాని అధికారికంగా లాంచ్ చేయనున్నారు. కాస్త సింపుల్ గా జరుగుతున్న ఈ ముహూర్త కార్యక్రమానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు హాజరు కానున్నారు.

గతమలో మహేష్ బాబు తో ‘దూకుడు’సినిమా తీసిన సుకుమార్ ఈ సినిమాకి డైరెక్టర్. మేము ఇది వరకు చెప్పినట్టు అదిరిపోయే కామెడీతో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని ఆశిస్తున్నారు. అలాగే మహేష్ బాబు ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.
తమన్నా హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ మూవీని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :