మహేష్ ఏఎంబీ సినిమాస్ కు ఏడాది.. విశేషాలెన్నో

Published on Dec 3, 2019 2:01 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు మల్టీప్లెక్స్ బిజినెస్లోకి ప్రవేశించి ఏఎంబీ సినిమాస్ పేరుతో హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో అధునాతన హంగులతో మల్టీప్లెక్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. మహేష్ చరీష్మా కారణంగా అతి తక్కువ కాలంలోనే ఏఎంబీ సినిమాస్ చాలా బాగా పాపులర్ అయింది. సెలబ్రిటీలు సైతం కుటుంబాలతో కలిసి అక్కడే సినిమాలు చూస్తున్నారు.

ఈరోజుతో ఏఎంబీ సినిమాస్ మొదలై ఏడాది గడిచింది. ఈ సందర్బంగా మహేష్ తన ఏఎంబీ బృందానికి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ 365 రోజుల్లో 310 సినిమాలు విడుదలవగా మొత్తం 12775 షోలు ప్రదర్శితమయ్యాయి. ఈ అన్ని షోలకు మొత్తంగా 2 మిలియన్ల టికెట్లు అమ్ముడయ్యాయి. ఏఎంబీ సినిమాస్ కు 2019 సంవత్సరానికి గానూ బెస్ట్ మల్టీప్లెక్స్ థియేటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ కూడా దక్కడం విశేషం.

సంబంధిత సమాచారం :

X
More