మహేష్ బాబు లుక్ రివీల్ అయింది

మహేష్ బాబు లుక్ రివీల్ అయింది

Published on Jul 9, 2019 3:00 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్ కాశ్మీర్ ప్రాంతంలో జరుగుతోంది. ఒక్క ఫుల్ లెంగ్త్ యాక్షన్ సీన్, ఒక పాటను అక్కడే షూట్ చేస్తున్నారు. ఇందులో ప్రిన్స్ పూర్తిస్థాయి ఆర్మీ అధికారిగా కనిపిస్తున్నారు. చిత్రీకరణలో సమయంలో అభిమాని ఒకరు షూటింగ్ తాలూకు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది.

అందులో మహేష్ లుక్ దాదాపు రివీల్ అయిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అభిమానులు సైతం మహేష్ లుక్ పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్ బాబుకు జోడీగా రష్మిక మందన్న నటించనుంది. ఇకపోతే తదుపరి షెడ్యూల్ కోసం హైదరాబాద్ నగరంలోని ఒక స్టుడియోలో ట్రైన్ సెట్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు