
కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది. నెల రోజుల పాటు పొల్లాచ్చి పరిసర ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంత నేపధ్యంలో కీలక సన్నివేశాలను చిత్రీకరించిన మూవీ యూనిట్ ఇటివల హైదరాబాద్ చేరుకుంది. విరామం తీసుకోకుండా రామోజీ ఫిల్మ్ సిటీలో వెంటనే మరో షెడ్యూల్ స్టార్ట్ చేశారు. మహేష్, ఇతర నటీనటులు షూటింగులో పాల్గొంటున్నారు.
సరికొత్త హెయిర్ స్టైల్, అల్ట్రా మోడరన్ లుక్, సూపర్ స్టైలిష్ కాస్ట్యూమ్స్ తో మహేష్ బాబు ఈ సినిమాలో కనిపించనున్నాడని యూనిట్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఈ సినిమాలో మహేష్ తండ్రిగా జగపతి బాబు నటిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్.
మైత్రి మూవీస్ పతాకంపై యలమంచిలి రవి శంకర్, సివి మోహన్, ఎర్నేని నవీన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ సినిమాకు ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇంకా అధికారికంగా నిర్మాతలు వెల్లడించలేదు.

