
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలీ తో ప్యారిస్ లో హాలిడే ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ హాలిడే ట్రిప్ తర్వాత నవంబర్ సెకండ్ వీక్ నుంచి మహేష్ బాబు బ్రహ్మోత్సవం షూటింగ్ లో పాల్గొంటాడు. అక్కడి నుంచి గ్యాప్ లేకుండా మార్చి వరకూ షూట్ చేసి ఆ సినిమాని ఫినిష్ చేసి ఏప్రిల్ లో సినిమాని రిలీజ్ చేసే ప్లాన్ లోఉన్నారు. బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ బాబు మురుగదాస్ తో ఓ సినిమా చేయనున్న సంగతి ఇది వరకే తెలియజేశాం.
వచ్చే ఏడాది సమ్మర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం నుంచి అందిన సమాచారం ప్రకారం 2106 ఏప్రిల్ 12న ఈ సినిమాని అధికారికంగా లాంచ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసారట. ప్రస్తుతం మురుగదాస్ ఫుల్ ప్లెడ్జ్ కథని సిద్దం చేసే పనిలో ఉన్నాడు. ఇదవ్వగానే నవంబర్లో హీరోయిన్ ని ఫైనలైజ్ చేస్తారు. ఈ సినిమాని కూడా బ్రహ్మోత్సవం తరహాలోనే తెలుగు తమిళ భాషల్లో షూట్ చేయనున్నారు. మహేష్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాని ఎన్.విప్రసాద్ – ఠాగూర్ మధులు కలిసి నిర్మించనున్నారు.

