ఇంటర్వ్యూ : యాత్ర డైరక్టర్ మహి వి రాఘవ్ – యాత్ర ప్రేక్షుకులకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది !

Published on Jan 29, 2019 4:45 pm IST

‘ఆనందో బ్రహ్మ’ చిత్రం తో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘యాత్ర’. ఈచిత్రం ఫిబ్రవరి 8న విడుదలవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఆ విశేషాలు మీకోసం..

అసలు ఈ చిత్రం ఎలా స్టార్ట్ అయ్యింది ?

నేను వైఎస్సాఆర్ గురించి కొన్ని ఆర్టికల్స్ చదివాను అలాగే కొందర్ని కలిసి ఆయన గురించి అడిగినప్పుడు ఆయన గురించి చాలా మంచిగా చెప్పారు. ఇండియాలో రాజకీయనాయకుల గురించి అంత మంచిగా చెప్పడం చాలా అరుదు. సో అప్పుడే ఆయన సినిమా తీయాలని ఆలోచన వచ్చింది.ప్రత్యేకంగా ఆయన రాజకీయ జీవితంలోని పాదయాత్ర అనే అంశాన్ని తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.

ఈచిత్రం కోసం వైఎస్సార్ కుటుంభ సభ్యులను ఎవరినైనా కలిశారా ?

లేదండి.కథ రాసుకున్న తరువాత ఈ చిత్రం యొక్క పోస్టర్ ను చూపించడానికి పాదయాత్రలో ఉన్నప్పుడు జగన్ గారిని కలిశాను. వైఎస్సార్ గారి రాజకీయ జీవితంలోని ఒక పార్ట్ ను తీసుకుని ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఈ చిత్రాన్ని తెరక్కిస్తున్నాను అని అన్నాను . దానికి జగన్ గారు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.

మమ్ముట్టి ని తీసుకోవడానికి గల కారణం ?

ఈసినిమా కి ఆయన అయితేనే కరెక్ట్ గా ఉంటుందని అనుకున్నాను. మమ్ముట్టి కి వున్నా చరిష్మ అలాగే ఆయన తెలుగులో కూడా సినిమాలు చేశారు. ఆయన పేస్ లో హంబుల్ నెస్ కనబడుతుంది. దళపతి సినిమా చూసి వైఎస్సార్ పాత్రకు ఆయనే అయితేనే బాగుంటుందని అనుకోని ఆయన ను సంప్రదించాను అలాగే ఈ చిత్రంలో వైఎస్సార్ గారి లుక్ గురించి , అలాగే ఆయన నడక గురించి , మాట గురించి పెద్దగా ఫోకస్ చేయలేదు.

ఈ సినిమా లో జగన్ గారి పాత్ర ఉందా ?

లేదండి. కొన్ని రియల్ విజువల్స్లో ఆయన కనబడుతాడు. అయితే స్క్రిప్ట్ లో వుంది కానీ నేనే తరువాత తీసేశాను. ఆయన పాత్ర పెడితే బిజినెస్ పరంగా ఉపయోగపడుతుంది కానీ ఎమోషనల్ కథలో ఓక పాత్రతో ట్రావెల్ అవుతున్నప్పుడు ఒక స్టార్ ఓకే రెండు నిమిషాలు స్క్రీన్ మీద కనబడితే ఆ ఫీల్ పోయే కొంచెం డిస్ట్రబ్ అయ్యే అవకాశం వుందని భావించి జగన్ పాత్రను పెట్టలేదు.

మీ తదుపరి చిత్రం గురించి ?

ప్రస్తుతానికైతే ఈసినిమా విడుదలకోసం ఎదురుచూస్తున్నాను. ఇప్పుడైతే ఏమి చెప్పలేను. ఎలాంటి జోనర్ లో సినిమా చేస్తాను అనేది ఈ సినిమా విడుదలయ్యాక తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :