బ్రేక్ ఈవెన్ దిశగా మజిలీ !

Published on Apr 7, 2019 12:00 pm IST

ఎలాంటి సక్సెస్ కోసమైతే నాగ చైతన్య ఇన్ని రోజులు ఎదురుచూసాడో అలాంటి విజయాన్ని అందించింది మజిలీ. మొన్న విడుదలైన ఈ చిత్రం యూనానిమస్ పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 9 కోట్ల షేర్ ను రాబట్టిన ఈ చిత్రం రెండవ రోజు హౌజ్ ఫుల్ కల్లెక్షన్లతో రెండు రోజుల్లో13.05కోట్ల షేర్ ను రాబట్టింది.

మరో 7కోట్లు రాబడితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఈ రోజు తో ఈచిత్రం ఆ ఫీట్ ను చేరుకోనుంది. దాంతో ఈ చిత్రం ఫుల్ రన్ లో డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను తీసుకురానుంది. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకం ఫై సాహు గారపాటి , హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం :