నైజాం లో భారీ స్థాయిలో విడుదలవుతున్న మజిలీ !

Published on Apr 4, 2019 10:14 am IST

యువ సామ్రాట్ నాగ చైతన్య , సమంత జంటగా నటించిన మజిలీ రేపు గ్రాండ్ గా విడుదలకానుంది. అందులో భాగంగా ఈ చిత్రం ఒక్క నైజాం ఏరియాలోనే సుమారు 200 కు పైగా థియేటర్లలలో విడుదలవుతుంది. పెద్ద సినిమాల విడుదల లేకపోవడం అలాగే శనివారం ఉగాది కావడం ఈ సినిమా కు కలిసి రానుంది. ఇక ఈ చిత్రం అటు యూఎస్ఏ లో కూడా భారీ స్థాయిలో విడుదలవుతుంది. రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో దివ్యాంశ కౌషిక్ మరో హీరోయిన్ గా నటించింది.

ప్రచార చిత్రాలతో అలాగే ప్రమోషన్స్ తో ఇప్పటికే ఈ చిత్రాన్ని మంచి హైప్ వచ్చింది. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకం ఫై సాహు గారపాటి , హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. గోపి సుందర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :