‘ఏ మనిషికే మజిలీయో’ పై వాడు చూపిస్తాడు !

Published on Mar 21, 2019 7:45 pm IST

శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, నాగ చైతన్య హీరోహీరోయిన్లుగా రాబోతున్న మజిలీ చిత్రం ప్రస్తుతం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. సమంత, నాగ చైతన్యలు సినిమాను బాగానే ప్రమోట్ చేస్తున్నారు. అయితే మరోపక్క చిత్రబృందం కూడా సినిమాలోని సాంగ్స్ ను ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది. తాజాగా ‘ఏ మనిషికే మజిలీయో’ అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసింది.

సాంగ్ లో ప్రధానంగా జీవితానికి సంబధించిన విషయాలను అలాగే జీవితంలో ఎదిగేందుకు భార్య ఎలాంటి సహాయం చేసిందో చెప్తున్న విషయాలను సరళమైన పదాలతో వనమాలి చాలా చక్కగా రాసారు . ఇక గోపి సుందర్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఏప్రిల్ 5 వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం :

More