సినిమా చూసాక ప్రతి భర్త తన భార్య గురించే.. !

Published on Apr 2, 2019 6:43 pm IST

నాగ చైతన్య – సమంత హీరోహీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతున్న మజిలీ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన భారీ ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే. కాగా మజిలీ క్లైమాక్స్ చాలా భావోద్వేగంతో గుండెకు హత్తుకునే విధంగా ఉంటుందని తెలుస్తోంది.

భర్తే ప్రాణం అని నమ్మే ఒక మంచి భార్యగా నటించిన సమంత నటన ఎమోషనల్ గా చాలా బాగా కనెక్ట్ అవుతుందని.. అలాగే సినిమా చూసాక ప్రతి భర్త తనభార్య గురించి ఆలోచించే విధంగా సినిమాలో మెసేజ్ ఉంటుందని సమాచారం.

మొత్తానికి భార్య గొప్పదనం చెప్పే సినిమా అన్నమాట మజిలీ. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా నటి దివ్యంశ కౌశిక్ ముఖ్య పాత్రలో నటిస్తుంది.

సంబంధిత సమాచారం :