మజిలీ లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on Apr 28, 2019 6:31 pm IST

యువ సామ్రాట్ నాగ చైతన్య, సమంత జంటగా నటించిన మజిలీ ఇటీవలవిడుదలై సూపర్ హిట్ అయ్యింది. 21రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 62.15కోట్ల గ్రాస్ ను అలాగే 36.27 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి చైతు కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. ఇక ఈ చిత్రం అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి బయ్యర్లకు మంచి లాభాలను తీసుకొచ్చింది.

ముఖ్యంగా ఈ చిత్రం నైజాం లో ఎక్సట్రార్డినరీ రన్ ను కొనసాగించింది. 21 రోజుల్లో అక్కడ 12కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ చిత్రం తో చైతూ వరుస పరాజయాలకు వేసుకున్నాడు. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ చిత్రంలో దివ్యంశ కౌశిక్ మరో హీరోయిన్ గా నటించగా గోపి సుందర్ సంగీతం అందించాడు. షైన్ స్క్రీన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

సంబంధిత సమాచారం :