వైరల్ అవుతున్న మజిలీ రెండో సాంగ్ !

Published on Mar 11, 2019 7:54 pm IST

సమంత, నాగ చైతన్య హీరోహీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతున్న మజిలీ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఈ రోజు సాయంత్రం 4:59 గంటలకు ఈ చిత్రం నుండి ‘ప్రియతమా’ అనే రెండో సాంగ్ విడుదల అయింది. ఈ పాట సమంత పాయింట్ అఫ్ వ్యూలో సాగుతుంది. సరళమైన పదాలతో ప్రేమికులను ఆకట్టుకునే విధంగా మనసులోని భావాలను తట్టి లేపే విధంగా ఉంది ఈ సాంగ్.

ఇక చైతు ఈ సినిమాలో రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడు. యంగ్ గెటప్ లో ఒకలా.. సమంతతో పెళ్లి తరువాత గెడ్డంతో మరో గెటప్ లో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా నటి దివ్యంశ కౌశిక్ ముఖ్య పాత్రలో నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

More