మజిలీ నాన్ థియేట్రికల్ రైట్స్ వివరాలు !

Published on Mar 7, 2019 11:28 am IST

టీజర్ తో మంచి హైప్ తెచ్చుకుంది మజిలీ చిత్రం. నాగ ఛైతన్య , సమంత జంటగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది. ఇక ఈచిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ ఛానెల్ జెమిని టీవీ 5 కోట్లకు సొంతం చేసుకోగా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ 3.5 కోట్లకు దక్కించుకుంది. అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ 4కోట్లు పలికాయి. ఇక థియేట్రికల్ బిజినెస్ దాదాపు అని ఏరియాల్లో పూర్తి అయ్యింది. టేబుల్ ప్రాఫిట్ తో విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నాడు.

ఎమోషనల్ లవ్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దివ్యంకా కౌశిక్ మరో హీరోయిన్ గా నటిస్తుంది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకం ఫై సాహు గారపాటి , హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం ఏప్రిల్ 5న విడుదలకానుంది. ఈచిత్రం ఫై చైతన్య చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ చిత్రం అంచనాలను అందుకొని చైతూ ని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

More