సమంత, నాగ చైతన్య హీరోహీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం మజిలీ. కాగా ఈ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన భారీ ఎత్తున విడుదల కానుంది. కాగా ప్రస్తుతం ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ హల్ లో జరుగుతుంది.
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. “నాగ్ మామ, వెంకీ మామ ప్రెసెన్స్ వల్ల పాజిటివిటీ వచ్చింది. ఏ మాయ చేశావే, మనం తర్వాత మజిలీ నాకు ఇంపార్టెంట్ సినిమా అవుతుంది. అందుకు శివ గారికి మనఃస్ఫూర్తిగా ధన్యవాదాలు. మా ఆయన గురించి నేను చెప్తే బాగోదు. ఏప్రిల్ 5 తర్వాత మీరే చెప్తారు’ అని అన్నారు.
ఇక ఈ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. ‘ చైతన్య గారు, సమంత గారు తమ పాత్రలకు ప్రాణం పోశారు. మిడిల్ క్లాస్ స్టోరీని ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూస్తున్నట్టు ఉంటుంది. రెండున్నర గంటల సేపు ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళే సినిమా మజిలీ’ అని తెలిపారు.


