మజిలీ రన్ టైం రివీల్ !

Published on Apr 4, 2019 1:10 pm IST

పెళ్లి తరువాత నాగ చైతన్య ,సమంత జంటగా నటించిన చిత్రం మజిలీ రేపు విడుదలకానుంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగున్నాయి. ఇక ఈ చిత్రం యొక్క రన్ టైం రివీల్ అయ్యింది. 2గంటల 34 నిమిషాల నిడివి తో ప్రేక్షకులముందుకు రానుంది ఈ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం యొక్క థియేట్రికల్ హక్కులు 21 కోట్లకు అమ్ముడైయ్యాయని సమాచారం. హిట్ టాక్ వస్తే ఈ మొత్తాన్ని రాబట్టడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.

శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకం ఫై సాహు గారపాటి , హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. మరి చైతూ కెరీర్ కు ఈసినిమా బూస్ట్ ఇస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :