సెన్సార్ పూర్తి చేసుకున్న మజిలీ !

Published on Apr 2, 2019 11:59 am IST


యువ సామ్రాట్ నాగ చైతన్య , సమంత జంటగా నటించిన తాజా చిత్రం మజిలీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఇక తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.

ఇప్పటికే విడుదలైన టీజర్ , సాంగ్స్, ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండి సినిమా ఫై భారీ అంచనాలను క్రియేట్ చేసాయి. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకం ఫై సాహు గారపాటి , హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. ఈచిత్రం ఏప్రిల్ 5న గ్రాండ్ గా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :