మజిలీ టీజర్ కి సూపర్ రెస్పాన్స్ !

మజిలీ టీజర్ కి సూపర్ రెస్పాన్స్ !

Published on Feb 14, 2019 3:50 PM IST

యువ సామ్రాట్ నాగ చైతన్య , సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం’ మజిలీ’. ప్రేమికుల రోజు కానుకగా ఈరోజు ఈచిత్రం యొక్క టీజర్ ను విడుదలచేశారు. ఇక ఈ టీజర్ పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఇప్పటికే 20 లక్షల డిజిటల్ వ్యూస్ ను రాబట్టుకుంది. ముఖ్యంగా ఈ టీజర్లో చైతూ , సమంత కెమిస్ట్రీ , డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యాయి.

‘నిన్నుకోరి’ తరువాత శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో నాగ చైతన్య క్రికెటర్ గా నటిస్తుండగా నటి దివ్యంకా కౌశిక్ చై ,ప్రేయసి పాత్రలో నటిస్తుంది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకం ఫై సాహు గారపాటి , హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం ఏప్రిల్ 5న విడుదలకానుంది.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు