నాగ చైతన్య ఈ సారి హిట్టు కొట్టేలానే ఉన్నాడు !

Published on Apr 1, 2019 8:34 am IST

ప్రేమమ్ తరువాత నాగ చైతన్య నటించిన సినిమాలు బాక్సాఫిస్ వద్ద విజయాలు సాదించలేకపోయాయి. ఇటీవల విడుదలైన సవ్యసాచి విజయాన్ని అందిస్తుందనుకున్నాడు కానీ ఆ సినిమాకు కూడా దారుణంగా ఫెయిల్ అయ్యింది. దాంతో నిన్ను కోరి వంటి బ్లాక్ బ్లాస్టర్ సినిమా ను ఇచ్సినా శివ నిర్వాణ తో మజిలీ అనే సినిమాకోసం చేతులు కలిపాడుచైతూ . వీరికి తోడు ఈ ప్రాజెక్టు లోకి సమంత కూడా జాయిన్ కావడం తోసినిమా స్టార్ట్ అవ్వడానికి ముందే మంచి హైప్ వచ్చింది. ఇక ఇటీవల విడుదలైన టీజర్ అంచనాలను రెట్టింపు చేయగా నిన్న విడుదలైన ట్రైలర్ సినిమా విజయం ఖాయం చేసేలా వుంది. దాంతో ఈ మజిలీ తో చైతూ చాలా రోజుల తరువాత విజయాన్ని ఖాతాలో వేసుకునేలా వున్నాడు అని టాక్ వస్తుంది.

షైన్ స్క్రీన్స్ పతాకం ఫై సాహు గారపాటి , హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం ఏప్రిల్ 5న విడుదలకానుంది. గోపి సుందర్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :