22 గంటల్లోపే.. 3 మిలియన్లు !

Published on Apr 1, 2019 7:40 pm IST

సమంత, నాగ చైతన్య హీరోహీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతున్న మజిలీ చిత్రం నిన్న ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ ను విడుదల చేసింది. ట్రైలర్ లో ‘‘సిగ్గుండాలిరా.. పెళ్లాం దగ్గర డబ్బులు తీసుకోవడానికి.. తినే తిండి.. కట్టుకునే బట్ట.. ఆఖరికి తాగే మందు కూడా భార్య సంపాదన మీదే..?’’ అంటూ రావు రమేశ్‌ డైలాగ్‌ తో ప్రారంభమైన ట్రైలర్‌ ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

కాగా ట్రైలర్ కేవలం 22 గంటల లోపే మూడు మిలియన్ల డిజిటల్ వ్యూస్ ను సాధించింది. గోపి సుందర్ మరియు తమన్ కలిసి ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన భారీ ఎత్తున విడుదల కానుంది. పెళ్లి తరువాత సమంత, నాగ చైతన్య మొదటిసారి కలిసి నటిస్తోన్నారు. మరి మజిలీ వాళ్లకు ఏ రేంజ్ హిట్ ఇస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం :