‘మజ్ను’ సినిమాపై పెరుగుతున్న అంచనాలు
Published on Sep 22, 2016 4:01 pm IST

nani-majnu
‘జెంటిల్మెన్’ చిత్రం తరువాత హీరో నాని నటించిన చిత్రం ‘మజ్ను’. ‘ఉయ్యాలా జంపాల’ తో దర్శకుడిగా పరిచయమైన విరించి వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆరంభం రోజు నుండే ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఆ తరువాత నెమ్మదిగా విడుదలైన ట్రైలర్లు, పాటలు ఆ అంచనాల్ని మరింతగా పెంచాయి. దీంతో ఈ చిత్రం యొక్క హిందీ రీమేక్ హక్కులు రూ.60 లక్షలకు అమ్ముడయ్యాయి.

పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పెద్ద మొత్తంలోనే జరిగి నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టిందని వినికిడి. ఇకపోతే రేపే విడుదలకానన్న ఈ చిత్రం గురించి హీరో నాని మాట్లాడుతూ ఇందులో వినోదానికి ఫుల్ గ్యారెంటీ అని, సినిమా చూశాక అందరూ నవ్వుకుంటూ బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో నాని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి అసిస్టెంట్ డైరెక్టర్ గా కనిపించనున్నాడు.

 
Like us on Facebook