యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘రభస’ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాలోని చివరి పాటని స్విట్జర్ ల్యాండ్ లో షూట్ చేస్తున్నారు. ఈ పాట షూటింగ్ కూడా 20వ తేదీకల్లా పూర్తి కానుంది. ఒక యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీ డోస్ కూడా బాగా ఎక్కువగా ఉంటుందని ఇదివరకే తెలియజేశాం.
‘రభస’లో ఎన్.టి.ఆర్ – బ్రహ్మానందంల కామెడీ సినిమాకే మేజర్ హైలట్ అవుతుందని డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ అంటున్నాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో వీళ్ళిద్దరి మధ్య వచ్చే కామెడీ సినిమాని మరో రేంజ్ కి తీసుకెళ్తుందని అంటున్నారు. ‘అదుర్స్’ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో ఎన్.టి.ఆర్ – బ్రహ్మానందంల కామెడీ ఈ సినిమాలో ఉంటుందని సంతోష్ శ్రెనివాస్ అంటున్నాడు.
సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించాడు. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమా ఆడియోని ఈ నెలాఖరులో రిలీజ్ చేసి సినిమాని ఆగష్టు 14న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


