“మేజర్” నుంచి ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ నెంబర్.!

Published on May 18, 2022 4:09 pm IST

టాలీవుడ్ యంగ్ అండ్ హీరో అడివి శేష్ నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “మేజర్”. దర్శకుడు శశి కిరణ్ తిక్క ఈ చిత్రం నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా చేసిన ఈ సినిమా నుంచి కూడా వస్తున్న ఒక్కో అప్డేట్ మంచి ప్రామిసింగ్ గా అంచనాలు పెంచుతూ వస్తుంది. మరి ఇదిలా ఉండగా ఇప్పుడు మేకర్స్ ఇంకో ఇంట్రెస్టింగ్ సాంగ్ రిలీజ్ చేశారు.

ఇది కూడా సినిమా నుంచి చాలా బాగుందని చెప్పాలి. శేష్ మరియు సాయీ మంజ్రేకర్ ల మధ్య కెమిస్ట్రీ ఇందులో చాలా బాగుంది. నెంబర్ పై జరిగే స్టోరీ అంతా చూస్తే ఆడియెన్స్ ని మంచి ఫీల్ ని అందించేలా ఉన్నాయి. మొత్తానికి అయితే ఈ సినిమా నుంచి మంచి చార్ట్ బస్టర్ ని సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకల అందించాడు. మరి ఎన్నో అంచనాలు నెలకొల్పుకొని ఉన్న ఈ చిత్రం ఈ జూన్ 3న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :