ఆ బోల్డ్ క్యారెక్టర్ లో రమ్యకృష్ణ నటిస్తోందా ?

Published on Apr 7, 2020 9:00 am IST

హీరో నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రీమేక్ కాబోతుంది బాలీవుడ్ సూపర్ హట్ మూవీ ‘అంధాదూన్’. కాగా ఈ చిత్రం హిందీలో విజయం సాధించడానికి గల ప్రధాన కారణాల్లో కథ, కథనం, నటుడు ఆయుష్మాన్ ఖురాన్ నటనతో పాటుగా నెగెటివ్ రోల్ చేసిన ‘టబు’ పెర్ఫార్మెన్స్ కూడా కీలకమైనదే. ఈ బోల్డ్ క్యారెక్టర్ లో టబు నటన సినిమాకే హైలెట్ నిలిచింది. ఇక తెలుగు రీమేక్ లో ఈ పాత్రను ఎవరు చేస్తారన్న విషయం ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో మొదట టబుయే నటిస్తుందనే వార్తలు వచ్చాయి.

ఆ తరువాత యాంకర్ కమ్ ఆర్టిస్ట్ అనసూయ పేరు కూడా తెరపైకొచ్చింది. టబు ఎలాగూ భారీ పారితోషకం డిమాండ్ చేస్తుంది కాబట్టి అనసూయను తీసుకోవాలనుకున్నారు. కాగా తాజాగా రమ్యకృష్ణను ఆ పాత్రలో తీసుకోవాలనే యోచనలో ఉన్నారట నిర్మాతలు. మరి రమ్యకృష్ణ నటించడానికి ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More