పనిలో పని “రాధేశ్యామ్” టీజర్ ను అప్పటికి ప్లాన్ చేస్తున్నారా ఏంటి.?

Published on Jan 17, 2021 12:18 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం “రాధే శ్యామ్”. పాన్ ఇండియన్ లెవెల్లో ప్లాన్ చేసిన చిత్రాన్ని రాధా కృష్ణ తెరకెక్కిస్తున్నారు. అయితే మరి ఈ చిత్రానికి సంబంధించి ఎప్పటి నుంచో టీజర్ కోసం అభిమానులు ఎంత గానో ఎదురు చూస్తున్నారు. కానీ మంచి అకేషన్స్ అన్ని అయ్యిపోతున్నాయి కానీ మేకర్స్ నుంచి ఆ టీజర్ అప్డేట్ అయితే రానే లేదు.

దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా నిరాశలో ఉన్నారు. అయితే ఇక్కడ మనం జస్ట్ సింపుల్ లాజికల్ గా ఆలోచిస్తే ఈ టీజర్ ఎప్పుడు వస్తుందో చెప్పొచ్చు. ఈ భారీ చిత్రాన్ని మేకర్స్ ఒక అద్భుతమైన పెయింటింగ్ లా ఇంతకు ముందు ఇండియన్ సినిమాలో రాని స్వచ్ఛమైన ప్రేమ కావ్యంగా వస్తుందని అవుట్ ఫుట్ పై చాలా క్లారిటీగా ఉన్నారు.

మరి అలాగే ఆ మధ్య విడుదల చేసిన మోషన్ పోస్టర్ టీజర్ లో కూడా ప్రపంచపు గ్రేటెస్ట్ ప్రేమికుల తర్వాత తమ విక్రమ్ ఆదిత్య మరియు ప్రేరణ లను పరిచయం చేశారు. మరి ఈ లెక్కన చూస్తే ఈ సినిమా టీజర్ ను వచ్చే ఫిబ్రవరి 14 ప్రపంచ ప్రేమికుల దినోత్సవం రోజున వచ్చే అవకాశం చాలానే ఉందని చెప్పొచ్చు. మరి ఆ స్పెషల్ డే రోజున ఈ టీజర్ ను ప్రభాస్ ఫ్యాన్స్ కు మరియు ప్రేమికులకు ఒక అపురూపమైన గిఫ్ట్ గా అందిస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం :