‘వెంకీ మామ’ వచ్చేది ఆ రోజే !

Published on Dec 2, 2019 4:50 pm IST

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ ‘వెంకీ మామ’. కె. ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రిలీజ్ పై ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 13న ‘వెంకీ మామ’ రిలీజ్ కానుంది.

ఇక ఫుల్ జోష్ మీదున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇందులో చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా నటిస్తుండగా, వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ మెరవనుంది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More