మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. థియేటర్లలో సాలిడ్ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఫస్ట్ ఛాయిస్‌గా నిలిచింది. టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ చిత్రం త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.
ఈ భారీ విజయం అందించిన ఉత్సాహంతో చిత్ర యూనిట్ జూన్ 14న మధ్యాహ్నం హైదరాబాద్‌లో ఒక గ్రాండ్ ‘సక్సెస్ ప్రెస్ మీట్’ను నిర్వహించేందుకు రెడీ అవుతోంది. వీక్‌డేస్‌లో కూడా సినిమా కలెక్షన్ల జోరు తగ్గకుండా ఉండేందుకు ఈ ఈవెంట్ మరింత ప్లస్ కానుంది. సినిమా విడుదలై ఇన్ని రోజులవుతున్నా సరైన పోస్ట్-రిలీజ్ ప్రమోషన్స్‌తో ‘పెద్ది’ టీమ్ సినిమాను నిరంతరం వార్తల్లో ఉంచుతూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో వంద శాతం సక్సెస్ అయింది.
ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీలు కీలక పాత్రలు పోషించారు.


