రంగస్థలంలోని రెండోపాట రాబోతోంది!
Published on Mar 1, 2018 9:45 am IST

మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తోన్న ‘రంగస్థలం’ చరణ్ సమంత జంటగా నటించిన ఈ సినిమాను సుకుమార్ దర్శకత్వం వహించారు. మర్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. జగపతిబాబు, అనసూయ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.

రంగస్థలం చిత్రంలోని మొదటిపాట విడుదలై పాపులర్ అయ్యింది. తాజాగా ఈ సినిమాలోని రెండో పాటను రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. రంగా రంగా స్థలానా అంటూ సాగే ఫోక్ సాంగ్ టీజర్ ఆకట్టుకుంటోంది. కోనసీమ బ్యాక్ డ్రాప్‌లో ఈ కథ సాగుతోంది. కోనసీమ కుర్రోడుగా చరణ్ కనిపించబోతున్నాడు. ఆది పినిశెట్టి చరణ్ అన్నయ్య పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల రెండో వారంలో వైజాగ్ లో భారీగా చెయ్యబోతున్నారు.

 
Like us on Facebook