‘ది బ్రేకింగ్ న్యూస్’ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

‘ది బ్రేకింగ్ న్యూస్’ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

Published on Apr 25, 2026 6:00 AM IST

మురళీ మోహన్, అనన్య నాగల్ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది బ్రేకింగ్ న్యూస్’. పవన్ కడియాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఇటీవల మెగాస్టార్ చిరంజీవి విడుదల చేయగా మంచి స్పందన లభించింది. తాజాగా చిత్ర బృందం మరో ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకుంది. ఈ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” పేరుతో ఓ ఆసక్తికరమైన గ్లిమ్స్‌ను విడుదల చేసింది.

​ఈ వీడియోలో మురళీ మోహన్ పాత్రను ఎంతో గంభీరంగా, ఆవేశభరితంగా చూపించారు. ఈ మేకింగ్ విజువల్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత్ రెడ్డి, ఉమా గూటూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమణరెడ్డి తాతిరెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

​ఈ చిత్రానికి శశి ప్రీతం సంగీతం అందిస్తుండగా, సాయినాథ్ సినిమాటోగ్రాఫర్‌గా, శిరీష్ ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. శరవేగంగా నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2026 మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు